ఎటు పోనే…
నిను తలచి తలచి… కలలు విడిచి, ఎటు పోనే
ఎటు పోనే…
ఎదకెదురు నిలిచే పిలుపు విడిచి… ఎటు పోనే
బహుదూరపు దారిలో… నిను చేరే మలుపుకే
నడిపించే దిక్కుకై… నిను వెతికానే
తెగుతున్నా దారమే… గురుతులతో నేయనా..!
మన గాలిపటమునే నేనెగరైనా… ఆ ఆ
ఆపలేని కోపమే… మార్చలేని లోపమా
అదుపులేని మంటని నేను… వచ్చి కౌగలించవా
మంచై ఆవహించవా… ఆ ఆ నిదరే రాదు కన్నీటికే…
అడ్డేపడే కల మరకలే చెరగవే… ఏ ఏ ఓ..!
పడిలేచె పయనాలే… ఓర్పంటె నేర్పెనులే
ఏకాంతం సాయం… శాంతముకే అడిగితినే…
పంటి బిగువున బాధనిచే… నవ్వుతున్నా నిను తలచే
ఏమైనా నాతో… వేరవని తీరోకటే…
వెళ్లొద్దే వెళ్లొద్దే నువ్వే… ఉంటానే తగ్గుండే నదై
నీ రక్తం నీ వెన్నెలే… పడుతుంటే నాలో
నేనొక ఎగసే ఉప్పెననే… చిగురాకైనా రాల్చనులే
కురులను సైతం బాధించని… ఓ గాలే అవనా
తేదీలేని మాసమై… ఎండమావి తీరమై
ఉండలేను ఊపిరాగుతూ… ఇంకా నీకు దూరమై
ఇంకా నీకు దూరమై
ఎటు పోనే…
నిను తలచి తలచి… కలలు విడిచి, ఎటు పోనే
ఎటు పోనే… ఎటు పోనే…
ఎదకెదురు నిలిచే పిలుపు విడిచి… ఎటు పోనే.. ..
Comments
Post a Comment