పల్లవి:- ఆయనే నా సంగీతము - బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే - జీవితకాలమెల్ల స్తుతించెదను
చరణం:- స్తుతుల మధ్యలో నివాసంచేసి - దూత లెల్ల పొగడే దేవుడాయనే
వేడుచుండు భక్తుల మొరలు విని - దిక్కులేని పిల్లలకు దేవుడాయనే
చరణం:- ఇద్దరు ముగ్గురు నా నామంబున - ఏకీభవించిన వారి మధ్యలోన
ఉండేదననిన మన దేవుని - కరములు తట్టి నిత్యం సుత్తించేదము
చరణం:- సృష్టికర్త క్రీస్తు యేసు నామంబున - జీవిత కాలమెల్ల కీర్తించెదను
రాకడలో ప్రభుతో నిత్యముందుము - మ్రొక్కెదము స్తుతించెదము పొగడెదము
Comments
Post a Comment